జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఓ ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ)తో పాటు స్థానికుడు ఉన్నాడని అధికారులు తెలిపారు.
ఇవాళ సాయంత్రం సోపోర్ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగించారు. ఈ దాడిలో ఎస్పీఓలు వజాహత్ అహ్మద్, షౌకచ్ ఖండే, ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు.