తెలంగాణ

telangana

లాక్​డౌన్​ వేళ పెరిగిన గృహ హింస కేసులు

By

Published : Apr 3, 2020, 10:49 AM IST

దేశవ్యాప్తంగా మార్చి 24న లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి మహిళలపై హింసకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్​లో 257 కేసులు నమోదయ్యాయి. వీటిలో 69 గృహ హింసకు సంబంధించినవి ఉన్నాయి.

Spike in domestic violence cases since lockdown, 69 complaints received: NCW
లాక్​డౌన్​ వేళ పెరిగిన గృహ హింస కేసులు....

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ కొందరు మహిళలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇళ్లకే పరిమితమవుతున్న కొందరు పురుషులు తమ పైశాచికత్వాన్ని భార్యలపై ప్రదర్శిస్తూ గృహ హింసకు పాల్పడుతున్నారు.

మార్చి 24 నుంచి ఏప్రిల్​ 2వ తేదీ వరకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు.. మహిళలపై హింసకు సంబంధించి మొత్తం257 ఫిర్యాదులు అందాయి. అందులో 69 గృహ హింసకు సంబంధించివి ఉన్నాయి.

మహిళా హింసకు సంబంధించి... 90కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా దిల్లీ(37) 2వ స్థానంలో ఉంది.

అత్యాచారం, వరకట్నం వేధింపులు వంటి కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది ఎన్‌సీడబ్ల్యూ.

ఇదీ చూడండి : ఎయిమ్స్​ వైద్యుడు, గర్భిణి భార్యకు కరోనా

ABOUT THE AUTHOR

...view details