దిల్లీ, ముంబయి నుంచి లండన్(యూకే)కు డిసెంబర్ 4 నుంచి నిరంతర విమాన సౌకర్యం కల్పించనున్నట్టు భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్‌కు తక్కువ ధరకే ఈ సేవలు అందిస్తామన్న స్పైస్‌జెట్.. దేశంలో ఈ ఘనత తమకే దక్కుతుందని తెలిపింది.
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో లండన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం(ఎయిర్‌బబుల్) ప్రకారం.. ఈ సేవలు కొనసాగించనున్నట్టు పేర్కొంది స్పైస్‌జెట్. అందులో భాగంగా 'ఎయిర్‌బస్ ఏ330-900 నియో' విమానాలను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఫ్లైట్‌లో... 353 ఎకానమీ, 18 బిజినెస్(విలాసవంతమైన) తరగతుల సీట్లు ఉంటాయి.