దిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు దేశరాజధానికి వెళ్లాలనుకునే వారికి శుభవార్త. ఓటింగ్ సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ దిల్లీకి ప్రయాణించే వారికోసం స్పైస్‌జెట్ ఉచిత టికెట్లను అందించనున్నట్లు తెలిపింది. కనీస ఛార్జీల పన్నులు, సర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. ఎయిర్‌లైన్స్ అంతర్గత ప్యానెల్ ప్రయాణికులను షార్ట్‌లిస్ట్ పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు.
ఒకేరోజు అయితే.. రెండు టికెట్లు
'స్పైస్ డెమోక్రసీ' పేరుతో ఇస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లలో.. ఫిబ్రవరి 8న దిల్లీకి బయలుదేరి మళ్లీ అదే రోజు తిరుగు ప్రయాణం చేస్తే రెండు టికెట్లపై మొత్తం బేస్ ఛార్జీలను తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది. అలా కాకుండా 7వ తేదీ వెళ్లి 8న తిరిగి వస్తే.. 8వ తేదీ ఒక్కరోజుకు మాత్రమే ఉచిత టికెట్ అందిస్తుంది. ఓటింగ్ రోజైన 8వ తేదీ వెళ్లి 9న వస్తే.. ఈ సందర్భంలోనూ 8వ తేదీకి మాత్రమే ఉచితమని ప్రకటించింది.