స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం! - Spicejet
ముంబయి విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా పెను ప్రమాదం తప్పింది. జైపూర్ నుంచి దేశ ఆర్థిక రాజధానికి వచ్చిన ఈ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అదుపుతప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాల నేపథ్యంలో స్పైస్‌జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం అర్ధరాత్రి ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే పై అదుపుతప్పింది. అధికారులు సత్వరమే సహాయకచర్యలు చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా విమానంలో ప్రయాణిస్తున్న 167 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. బోయింగ్ రకానికి చెందిన ఈ విమానం జైపూర్ నుంచి ముంబయికి వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం ప్రధాన రన్‌వేను అధికారులు మూసివేశారు. ప్రత్యామ్నాయంగా మరో రన్‌వే పై రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా కొన్ని అంతర్జాతీయ విమానాలను బెంగళూరు, అహ్మదాబాద్ వైపు మళ్లించారు.