అణ్వస్త్రాల వినియోగంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అణ్వాయుధాల విధానంలో భారత వైఖరి మారిందా అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ. రాజ్‌నాథ్ ప్రకటన అస్పష్టంగా ఉందన్నారు.
" అణ్వస్త్ర విధానంలో ప్రభుత్వం వెనక కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని ప్రతిఒక్కరు ఉన్నారని అందరికి తెలుసు. ఇలాంటి అస్పష్ట ప్రకటనలతో రక్షణ మంత్రి మన ఊహకే వదిలేస్తున్నారా లేదా అణ్వస్త్రాల విధానంలో మార్పు చేయాలని కోరుకుంటున్నారా స్పష్టతనివ్వాలి. కొత్త విధానం ఏమిటో తెలిస్తే దేశం మొత్తం సంతోషంగా ఉంటుంది. అస్పష్టంగా, అసంపూర్తిగా కాకుండా పూర్తిగా తెలియజేయాలి."
- అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత.