జాతిపిత మహాత్మాగాంధీ గుడి ఇది. ఆయనకు నిత్యం పూజలు జరిగే చోటిది. యాద్గిర్ జిల్లాలోని బాలశెట్టిహాల్ గ్రామంలో ఉందీ ఆలయం. గాంధీజీ గౌరవార్థం హంపన్న సహూకార్.. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 1948లో ఈ గుడి నిర్మించారు. 70 ఏళ్లుగా ఈ గుళ్లో గాంధీజీకి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్థులు.
"దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటకలో గాంధీజీ గుడి నిర్మితమైంది. మాజీ టీడీబీ సభ్యుడు హంపన్న సహూకార్ తన పదవీకాలంలో గుడి కట్టించి విగ్రహం ప్రతిష్ఠించారు."
- మనోహర్, గ్రామస్థుడు
పరిష్కార వేదికగా..
గాంధీజీ విగ్రహానికి గ్రామస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తారు. ప్రజల మధ్య విభేదాలు తలెత్తినా ఈ ఆలయం వేదికగానే పరిష్కరించుకుంటారు. 68ఏళ్ల తర్వాత ఊరి ప్రజలంతా కలిసి ఆలయ పునరుద్ధరణ చేపట్టారు. గాంధీజీ గుడిని మరింత సుందరంగా మలచుకున్నారు.