ప్రతి ఇంటా మహిళలు చేతికి రంగురంగుల గాజులు వేసుకుని.. ఇంటిపని, వంటపనీ చేసేటప్పుడు వచ్చే గాజుల శబ్దం మధురంగా ఉంటుంది. ఎరుపు, పసుపుపచ్చ, ఆకుపచ్చ సహా.. అన్ని రంగుల గాజులు భారతీయ సంస్కృతిలో భాగమే. ప్రత్యేకించి, లక్కతో తయారైన గాజులకు మహిళలు, యువతుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ లక్కగాజులు తయారుచేసే కళాకారులకు భారత్‌రంగ్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆహ్వనమందింది. జైపుర్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
"లక్కకు పెద్ద చరిత్రే ఉంది. మన సంస్కృతిలోనూ దానికి ప్రత్యేక స్థానముంది. పాండవుల కోసం కౌరవులు నిర్మించిన లక్షగృహం లక్కతోనే నిర్మించారు. మహాభారతంలోనూ అంతటి ప్రత్యేకత ఉన్న లక్కతో తయారైన గాజులు చాలా ప్రసిద్ధి పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు."
- పూనమ్ నౌరియా, రిపోర్టర్
ఇదీ చదవండి:భూలోక స్వర్గాన్ని తలపించే అద్దాల మేడ
మహాభారతం స్ఫురణ..
లక్కతో గాజులు తయారుచేయడం తమ కుటుంబ వ్యాపారమనీ.. 32ఏళ్లుగా గాజుల తయారీలోనే నిమగ్నమయ్యానని చెప్తున్నాడు జైపూర్‌కు చెందిన కళాకారుడు మొహమ్మద్ అసీఫ్. లక్క గురించి మాట్లాడితే, మహాభారతం స్ఫురణకు వస్తుంది. పాండవులను చంపేందుకు లక్కతో నిర్మించిన లక్షగృహానికి కౌరవులు నిప్పంటిస్తారు.
"మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను చంపడానికి ఓ మహల్‌ను నిర్మిస్తాడు. అతీత శక్తిని ఉపయోగించి ఆయన సురక్షితంగా బయటపడతాడు. పండగల సమయాల్లో మేం మా కళను ప్రదర్శిస్తాం. జనాలు మెచ్చుకుంటారు."