ట్రంప్ దంపతుల కోసం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి. ఇందులో స్టార్టర్లుగా సాల్మన్ ఫిష్ టిక్కా, ఆలూ టిక్కా, పాలకూర చాట్, వివిధ రకాల సూప్‌లను ఉంచారు. ప్రధాన వంటకాలుగా రాష్ట్రపతి భవన్ ప్రత్యేకమైన దాల్ రాయ్సీనాతోపాటు, ట్రంప్ ప్రత్యేకంగా ఇష్టపడే మాంసం, మటన్ బిర్యానీ, మటన్ రాన్‌లను వడ్డించారు.
ట్రంప్ దంపతుల కోసం చవులూరించిన వంటకాలు - special recipes for the Trump couple
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా కోసం రాష్ట్రపతి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ట్రంప్ దంపతుల కోసం పలు శాకాహార, మాంసాహార వంటకాలు సిద్ధం చేశారు. మటన్ బిర్యానీ, మటన్రాన్, వెనీలా ఐస్‌క్రిమ్, మాల్చువా పలు రకాల వంటకాలు ఏర్పాటు చేశారు.
ట్రంప్ దంపతుల కోసం చవులూరించిన వంటకాలు
అలాగే పుట్టగోడుగుతో చేసిన ప్రత్యేక వంటకం, హేజెల్‌నట్- ఆపిల్, వెనీలా ఐస్‌క్రిమ్, మాల్చువా, రబ్డీలు మెనూలో ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం.. ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ పసందైన విందు చేశారు. అనేక రకాల శాకాహార, మాంసాహార వంటకాలు పెట్టారు. మటన్ రాన్, పుట్టగొడుగు కూర వంటి భారత వంటకాలు, ఆయన కోసం సిద్ధం చేసిన మెనూలో ఉన్నాయి.
ఇదీ చూడండి:దిల్లీ 'పౌర' ఘర్షణలపై రేపు సుప్రీంలో విచారణ
Last Updated : Mar 2, 2020, 2:39 PM IST