తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే కార్యక్రమంలో ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' - ఈటీవీ భారత్​ ప్రత్యేక గీతం

మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా 'ఈటీవీ భారత్'​ రూపొందించిన 'వైష్ణవ జన తో' గీతానికి విశేష స్పందన వస్తోంది. రైల్వేశాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలోనూ ఈ గీతాన్ని పలుమార్లు ప్రదర్శించారు. ఈటీవీ భారత్​ కృషిని అభినందించారు.

రైల్వే కార్యక్రమంలో ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో'

By

Published : Oct 3, 2019, 11:39 AM IST

మహాత్ముడుకి 'ఈటీవీ భారత్'​ అందించిన సరికొత్త నివాళిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ గీతానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.

గాంధీ జయంతిని పురస్కరించుకొని దిల్లీలో రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలోనూ ఈ గీతాన్ని పలుమార్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహాత్ముడి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. 'ఈటీవీ భారత్​ను' ఉత్తర భారత రైల్వే సీపీఆర్​ఓ దీపక్​ కుమార్​ అభినందించారు.

రైల్వే కార్యక్రమంలో ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో'

మహాత్ముడికి అత్యంత ఇష్టమైన భజన గీతాన్ని 'ఈటీవీ భారత్'​ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ గాయనీగాయకులతో రూపొందించింది.

ABOUT THE AUTHOR

...view details