తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఫ్యాషన్.. అందుబాటులో డిజైనర్ మాస్కులు! - stone hand embroidery masks

కరోనా మహమ్మారి విజృంభణతో మాస్క్​లు ధరించటం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో తయారీదారులు వివిధ రకాల మాస్క్​లను తయారు చేస్తున్నారు. ఛత్తీస్​గడ్​ రాయ్​పుర్​లో చిన్నారులు, పెద్దలు, మహిళల కోసం ప్రత్యేక విభిన్న డిజైన్లతో మాస్క్​లు రూపొందిస్తున్నారు. వధూవరుల కోసం ప్రత్యేక ఆకర్షణలతో సిద్ధం చేసి అమ్మకానికి పెడుతున్నారు.

Special package on designer masks from Raipur
పలు డిజైనర్లతో కూడిన మాస్క్​లను ఎప్పుడైన ధరించారా!

By

Published : Jun 11, 2020, 6:12 AM IST

కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవన విధానంలో భారీ మార్పులే వచ్చాయి. ప్రస్తుతం మాస్క్​లు ధరించటం విధిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో విభిన్న రకాల మాస్క్​లు మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యాషన్​, డిజైనర్​ మాస్క్​లకు డిమాండ్​ పెరుగుతోందని అంటున్నారు ప్రముఖ డిజైనర్​ స్టూడియో డైరెక్టర్​ డాలీ బర్​వాని.

డిజైన్లతో కూడిన మాస్క్​లు

లాక్​డౌన్​ తర్వాత డిజైనర్​ దుస్తులకు డిమాండ్​ లేకుండా పోయింది. డిజైనర్ స్టోన్​ కార్మికులకు పని చేయటం తప్పనిసరి. అయితే పనులు లేకుండా ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. అప్పడే డిజైనర్​ మాస్క్​ల రూపకల్పన చేయాలనే ఆలోచన వచ్చింది. కరోనా చాలా కాలం పాటు ఉంటుంది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్​డౌన్ ముగిసిన తర్వాత కూడా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మాస్క్​ల వాడకం తప్పనిసరి.

-డాలీ బర్​వాని.

మాస్క్ తయారీ

వధూవరుల కోసం ప్రత్యేక మాస్క్​లు..

లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా 50 మందితో వివాహం చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయిన కారణంగా వధూవరుల కోసం ప్రత్యేక మాస్క్​లను తయారు చేస్తున్నట్లు చెప్పింది డాలీ. వధువు పెళ్లి దుస్తులకు నప్పే మాస్క్​లను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

స్టోన్​ డిజైన్​ కోనం..

హ్యాండ్​ ఎంబ్రాయిడరీ, స్టోన్​ అల్లికలు...

మాస్కులను​ మూడు విభిన్న రకాల్లో తయారుచేస్తున్నారు. చిన్న పిల్లలు మాస్క్​ ధరించటానికి ఇష్టపడనందున వారి కోసం కార్టూన్​ పాత్రలు, సీతాకోకచిలుకల బొమ్మలతో కూడిన మాస్క్​లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా బటన్లు, పువ్వులు, చేతితో చేసే డిజైనరీ స్టోన్ ఎంబ్రాయిడరీ మాస్క్​లు, మిషన్​తో చేసే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నట్లు డాలీ తెలిపారు.

మహిళల కోసం

వివిధ రకాల డిజైనర్​ మాస్క్​లకు డిమాండ్​ పెరుగుతుందని, వివాహ వేడుకల సమయంలోనూ ప్రత్యేక మాస్క్​ల వినియోగం పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాస్క్​ల వినియోగం ఎక్కువగా ఉన్నందున వీటిని తయారు చేసే వారికి మంచి వ్యాపార అవకాశమని ఛత్తీస్​గడ్​ మెడికల్​ కౌన్సిల్​ సభ్యడు డాక్టర్​ రాకేశ్​ గుప్తా అభిప్రాయపడ్డారు.

చిన్నారులకు కార్టూన్​ మాస్క్​లు

ఇదీ చూడండి:మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!

ABOUT THE AUTHOR

...view details