తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రచార మంత్రిని కాదు.. ప్రజల మనిషిని' - pm

"ప్రధాన మంత్రి కాదు ప్రచార మంత్రి" అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శను తిప్పికొట్టారు నరేంద్రమోదీ. ప్రజల్లో ఉండేందుకే తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసంగా చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీ

By

Published : May 10, 2019, 4:59 PM IST

2014 ఎన్నికల కన్నా ఈసారి ఎన్డీఏకు అధిక మెజారిటీ లభిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. గతంలో భాజపా బలహీనంగా ఉన్న స్థానాల్లోనూ ఈసారి పుంజుకుంటామని చెప్పారు. హరియాణా రోహతక్​లో బహిరంగ సభ తర్వాత... ఏఎన్​ఐ వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చారు మోదీ.

"ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెబుతున్నారు.. మీరు దేశమంతా పర్యటనలు చేస్తున్నారు కదా.. మీకు ఏమనిపిస్తోంది?" అన్న ప్రశ్నకు మోదీ ఇలా సమాధానమిచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీ

"నేను ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నాను. ప్రధాని కార్యాలయానికే పరిమితమయ్యే వ్యక్తిని కాదు నేను. ఐదేళ్లు ప్రచారంలోనే ఉంటారని నాపై ఓ అపవాదు సృష్టించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండటమే అసలైన బాధ్యత. ఈ ఎన్నికల విషయంలో పూర్తి విశ్వాసంతో చెబుతున్నా. భాజపాకు గతం కన్నా ఎక్కువ మెజారిటీ లభిస్తుంది. మా మిత్రపక్షాలూ అదే తీరులో గెలుస్తాయి. పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేం బలహీనంగా ఉన్న స్థానాల్లోనూ ఈసారి పుంజుకుంటాం. భారత దేశం అంతటా కమలమే వికసిస్తుంది. వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతకంతకూ భాజపా గెలుస్తూనే ఉంటుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details