తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జిన్​పింగ్​ కోసం స్పెషల్​ సాంబార్​, హల్వా - modi jinping meet in chennai

ప్రధాని నరేంద్ర మోదీతో చారిత్రక భేటీ కోసం చెన్నై చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు తమిళనాడు గవర్నర్​ భన్వరీలాల్​ పురోహిత్​. మోదీ, జిన్​పింగ్​ కలిసి దాదాపు 6 గంటలపాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. జిన్​పింగ్​ విందు కోసం దక్షిణాది ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు.

జిన్​పింగ్​ కోసం స్పెషల్​ సాంబార్​, హల్వా

By

Published : Oct 11, 2019, 3:21 PM IST

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ చెన్నై చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లపురంలో అనధికారిక సమావేశంలో పాల్గొననున్నారు. చెన్నై విమానాశ్రయంలో జిన్​పింగ్​కు సాదర స్వాగతం పలికారు తమిళనాడు గవర్నర్​ భన్వరీలాల్​ పురోహిత్​.

మోదీ, జిన్​పింగ్​ కలిసి దాదాపు ఆరు గంటల పాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇరువురు నేతలు 40 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అవుతారని సమాచారం. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు.

దక్షిణాది వంటకాలతో ప్రత్యేక విందు

చైనా అధ్యక్షుడికి మామల్లపురంలో పసందైన విందు ఇవ్వనున్నారు మోదీ. ఇందుకోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. దక్షిణాది వంటకాలు టమాట రసం, అరచవిట్ట సాంబార్, పల్లీల చట్నీ, కాశీ హల్వాను చైనా అధ్యక్షుడికి విందుగా వడ్డించనున్నారు. వీటితో పాటు చెట్టినాడ్​, కరైకుడి వంటి ప్రాంతీయ వంటకాలనూ జిన్​పింగ్ కోసం తయారు చేస్తున్నారు.

చైనా అధ్యక్షుడికి చెన్నైలో ఘన స్వాగతం

ఇదీ చూడండి: జిన్​పింగ్​తో భేటీకి ముందు మోదీ 'త్రీడీ' ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details