వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన నేటి తీర్పును విమర్శించింది కాంగ్రెస్. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. మతతత్వ సఖ్యత, సోదరభావం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు.. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయాలని కోరారు సుర్జేవాలా.
"బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగినట్లు గతేడాది నవంబర్ 9న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరనీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం" అని సుర్జేవాలా విమర్శించారు.
"దేశవ్యాప్తంగా లోతుగా పాతుకుపోయిన భాజపా, ఆర్ఎస్ఎస్లు రాజకీయ కుట్రలకు ఈ తీర్పు సాక్ష్యం. దేశంలోని సోదరభావం, మతతత్వ స్నేహాన్ని నాశనం చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు."