బాబ్రీ మసీదు కేసులో బుధవారం ఉదయం 10:30 గంటలకు తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ నేపథ్యంలో.. కేసులో నిందితులందరూ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
బాబ్రీ కేసులో మొత్తం 49మందిని నిందితులుగా గుర్తించగా.. వీరిలో 17మంది మరణించారు. మిగిలిన 32మంది నిందితుల జాబితాలో.. భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎమ్ఎమ్ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు.
అయితే.. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె రిషికేష్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అనుమతి ఇస్తే కోర్టుకు హాజరవుతానని సోమవారం ట్వీట్ ద్వారా వెల్లడించారు.
351మంది సాక్ష్యులు...