తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజంఖాన్​ బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే!

మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్​ను క్షమాపణలు చెప్పాల్సిందిగా లోక్​సభ స్పీకర్​ కోరనున్నారని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు. క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్​కు ఉందని స్పష్టం చేశారు.

ఆజంఖాన్​ బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే!

By

Published : Jul 26, 2019, 6:39 PM IST

భాజపా ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ ఆజంఖాన్​ను క్షమాపణలు చెప్పాల్సిందిగా స్పీకర్​ ఓం బిర్లా సూచించనున్నారు. అన్ని పార్టీల నేతలతో సమావేశమైన తర్వాత బిర్లా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

"ఎంపీ రమాదేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆజంఖాన్​ను... స్పీకర్ ఓం బిర్లా లోక్​సభలో అడగనున్నారు. ఆజంఖాన్​ క్షమాపణ చెప్పకపోతే... ఆయనపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్​కు​ అధికారం ఉంది."
- ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

ఐదేళ్లపాటు సస్పెండ్ చేయండి

భాజపా ఎంపీ రమాదేవి.... తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్​ను లోక్​సభ నుంచి 5 సంవత్సరాలపాటు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: మోదీ 2.0 సర్కారు 50 రోజుల ప్రోగ్రెస్​ కార్డ్

ABOUT THE AUTHOR

...view details