తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమాజ్​వాదీ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా 'ములాయం'​ - మెయిన్​పురి

సమాజ్​వాదీ పార్టీ తాజాగా విడుదల చేసిన ప్రధాన ప్రచారకర్తల జాబితాలో పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ పేరును చేర్చింది. ములాయంతోపాటు అఖిలేశ్​ యాదవ్​, రాంగోపాల్​ యాదవ్​, జయా బచ్చన్​, డింపుల్​ యాదవ్​ తదితరులు జాబితాలో ఉన్నారు.

సమాజ్​వాదీ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా 'ములాయం'​

By

Published : Mar 25, 2019, 7:13 AM IST

Updated : Mar 25, 2019, 9:22 AM IST

సమాజ్​వాదీ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా 'ములాయం'​

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాజ్​వాదీ పార్టీ పావులు కదుపుతోంది. తాజాగా పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్ పేరును 'ప్రధాన ప్రచారకర్తల' జాబితాలో చేర్చింది.

శనివారం ఎన్నికల కమిషన్​కు పంపించిన నలభై మంది పార్టీ ప్రధాన ప్రచారకర్తల జాబితాలో ములాయం సింగ్​ యాదవ్​ పేరు లేదు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆదివారం విడుదల చేసిన సవరించిన జాబితాలో ప్రథమ స్థానంలో ములాయం సింగ్​ యాదవ్​ పేరును చేర్చింది.

తాజా సవరణ జాబితాలో ములాయం సింగ్​తో పాటు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, సీనియర్​ నేత రాం​ గోపాల్​ యాదవ్​, ఆజామ్​ఖాన్​, డింపుల్​ యాదవ్​, జయా బచ్చన్​ తదితరులు ఉన్నారు.

ఈ లోక్​సభ ఎన్నికల్లో ములాయం.. మెయిన్​పురి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచే ఆయన 1996, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కనుక ఇదే సురక్షిత స్థానమని పార్టీ నమ్ముతోంది.

ప్రస్తుతం ఆయన ఆజాంఘడ్​​ లోక్​సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ములాయం మెయిన్​పురి, ఆజాంఘడ్​​ రెండు స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం.

బీఎస్పీతో పొత్తులో భాగంగా ఉత్తరప్రదేశ్​లోని 80 స్థానాల్లో 37 చోట్ల ఎస్పీ పోటీచేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్​ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : Mar 25, 2019, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details