తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో ఉమ్మడి ప్రచారానికి 'కూటమి' సిద్ధం - ఆర్జేడీ

ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారాన్ని నేడు ప్రారంభించనున్నారు. అఖిలేశ్​యాదవ్​, మాయావతి, అజిత్​ సింగ్​ ఒకే వేదిక మీదికి రానున్నారు. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది కూటమి.

మాయావతి, అఖిలేశ్​

By

Published : Apr 7, 2019, 6:36 AM IST

Updated : Apr 7, 2019, 7:31 AM IST

నేడు ఒకే వేదికపైకి మాయావతి, అఖిలేశ్​, అజిత్​ సింగ్​

సమాజ్​వాదీ, బహుజన్​ సమాజ్​, రాష్ట్రీయ లోక్​ దళ్​ పార్టీల కూటమి లోక్​సభ ఎన్నికల సంయుక్త ప్రచారానికి నేడు శ్రీకారం చుట్టనుంది. దీనికి ఉత్తర్​ప్రదేశ్​ సహరన్​పూర్​​లోని దేవ్​బంద్​​ వేదిక కానుంది.

దేవ్​బంద్​లో నేడు జరిగే ఈ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, ఆర్​ఎల్​డీ అధినేత అజిత్​ సింగ్​, ఉపాధ్యక్షుడు జయంత్​ చౌదరి పాల్గొంటారని బీఎస్పీ ప్రతినిధి తెలిపారు.

కూటమిగా ఏర్పాడ్డాక మూడు పార్టీల నేతలు సంయుక్తంగా పాల్గొనే మొదటి సభఇదే.

మొత్తం 11 ఉమ్మడి సభలు

మూడు పార్టీల అధినేతలు సంయుక్తంగా 11 సభల్లో పాల్గొంటారని ఆర్​ఎల్​డీ ప్రతినిధి అనిల్​ దూబే తెలిపారు. ఇవి ఈ నెల 7 నుంచి మే 16వ తేదీ మధ్యలో ఉంటాయని వెల్లడించారు.

నేటి దేవ్​బంద్​ సభ తర్వాత బదౌన్​, ఆగ్రా, మణిపురి, రాంపూర్​, ఫిరోజాబాద్​, కన్నౌజ్​, ఫైజాబాద్​, అజంగఢ్​, గోరఖ్​పూర్​, వారణాసిలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో అఖిలేశ్​, మాయావతి, అజిత్​ సింగ్​ సంయుక్తంగా పాల్గొంటారని తెలిపారు.

లోక్​సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఎనిమిది స్థానాలకు ఏప్రిల్​ 11న పోలింగ్​ జరగనుంది.

యూపీలో మొత్తం 80 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. సీట్ల పంపకాల్లో భాగంగా 37 చోట్ల సమాజ్​వాదీ, 38 స్థానాల్లో బహుజన్​ సమాజ్​ పార్టీ పోటీ చేయనుంది. మూడు స్థానాల్లో ఆర్​ఎల్​డీ బరిలోకి దిగనుంది. రాహుల్​ గాంధీ, సోనియా గాంధీ పోటీ చేస్తున్న అమేఠి, రాయ్​బరేలి స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపడం లేదు కూటమి.

Last Updated : Apr 7, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details