సమాజ్వాది పార్టీ... బహుజన్ సమాజ్ పార్టీ ... రెండూ భిన్న ధృవాలు... ఒక పార్టీకి అఖిలేశ్ సారథి కాగా మరో పార్టీకి అధినేత్రి.. డైనమిక్ లీడర్ మాయావతి... ఇంతకుముందు ప్రత్యర్థులైన వారు ఈ సారి ఉత్తర్ప్రదేశ్లో మహాకూటమిగా జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా భాజపాను ఓడించాలనేదే వీరి లక్ష్యం. కానీ దారుణంగా విఫలయయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్. ఇక్కడ భాజపాను కూటమి అడ్డుకుంటుందని అందరూ ఊహించారు. తీరా ఫలితాలు చూస్తే 80 సీట్లకు గానూ ఈ కూటమి 15 స్థానాలకే పరిమితమైంది. భాజపా విజయదుందుభి మోగించింది.
2017లో ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్తో సంకీర్ణం ఏర్పాటు చేసి పోటీ చేసినప్పటికీ విఫలమయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో వీరి కలయికను ప్రజలు ఆదరించలేదు. అనంతర పరిణామాలతో ఎస్పీ, బీఎస్పీ దగ్గరయ్యాయి.
లెక్కలు తప్పిన కూటమి...
మొదట.. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ , బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగింది. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పొత్తు పెట్టుకున్నా హస్తం పార్టీని దగ్గరకు తీసుకోలేదు. ఇది భాజపాకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎస్పీకి 22.2 శాతం.. బీఎస్పీకి 19శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండూ కలిస్తే 41.8% ఓట్లు సాధించవచ్చని భావించాయి. వాటికి ఆర్ఎల్డీ ఓట్లూ కలిపితే దాదాపు 42.5% అవుతుంది. కలిసి పోటీ చేస్తే భాజపా సాధించిన ఓట్లకు చేరువగా వెళ్లే అవకాశముందని భావించాయీ పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఈ మూడు కలిసి పోటీ చేశాయి . అయినాగానీ భాజపా విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.
ఈ రాష్ట్రంలో 2014 లోక్సభ ఎన్నికల్లో 42.3 శాతం ఓట్లతో ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది భాజపా. ఈ సారి 7 స్థానాలు కోల్పోయి 64 సీట్లకు పరిమితమైంది.
కూటమితోనే...