తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో మూడు పార్టీలతో జట్టు కట్టిన సమాజ్​వాదీ - కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్​ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్న సమాజ్​వాదీ పార్టీ.. తాజాగా మరో మూడు స్థానిక పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది.

అఖిలేశ్​ యాదవ్​

By

Published : Mar 26, 2019, 5:55 PM IST

Updated : Mar 26, 2019, 6:52 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ పావులు కదుపుతోంది. తాజాగా నిషాద్​, జనవాదీ (సోషలిస్ట్), రాష్ట్రీయ సమంత దళ్​ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది.

ఇప్పటికే మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్పీ), అజిత్​ సింగ్ ఆధ్వర్యంలోని​ 'రాష్ట్రీయ లోక్​ దళ్' (ఆర్​ఎల్​డీ)తో ఎస్పీ కూటమి ఏర్పాటు చేసింది.

ఉత్తరప్రదేశ్​లో 80 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపా ఓటమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్​లోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యాయి. కాంగ్రెస్​ మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమైంది.

భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

అధికార భాజపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ ​యాదవ్​ ఆరోపించారు. గవర్నర్​​, ప్రభుత్వ సంస్థలు, ప్రసార మాధ్యమాలను అక్రమంగా భాజపా ప్రచారానికి వాడుకుంటోందని అఖిలేశ్ విమర్శించారు. ఇటీవల రాజస్థాన్ గవర్నర్​ కల్యాణ్​ సింగ్​, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించడాన్ని అఖిలేశ్​ గుర్తుచేశారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేస్తామని అఖిలేశ్​ తెలిపారు.

"ఈ లోక్​సభ ఎన్నికలు ప్రధానంగా ప్రతిపక్షాలకు, చౌకీదార్ (మోదీ)కి మధ్య జరుగుతున్నాయి. భాజపా ప్రచారకులు ఎవరంటే గవర్నర్, ప్రభుత్వ సంస్థలు, ప్రసార మాధ్యమాలు."-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు

Last Updated : Mar 26, 2019, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details