రాజకీయాల్లో చేరాలని వచ్చిన ఒత్తిళ్ల వల్లే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెనొప్పి వచ్చిందని.. సీపీఐ(ఎం) సీనియర్ నేత అశోక్ భట్టాచార్య ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌరవ్‌ను ఆయన పరామర్శించారు.
'మేము గంగూలీపై ఒత్తిడి పెంచడానికి రాలేదు. రాజకీయాల్లో చేరొద్దంటూ గత వారం ఆయనకు చెప్పాను. నా అభిప్రాయాలను సౌరవ్ వ్యతిరేకించలేదు' అని భట్టాచార్య పేర్కొన్నారు.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఈ మాజీ క్రికెటర్ భాజపాలో చేరుతాడనే ఊహాగానాలు వచ్చాయి. రాజకీయల్లోకి రావడం గురించి గంగూలీ ఏనాడూ తన ఉద్దేశాన్ని ప్రకటించలేదు. కొంతమంది ఆయనను రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు. బహుశా ఆ విషయం వల్లే ఒత్తిడి పెరిగిందేమో. సౌరవ్ ఏనాటికి రాజకీయ అంశం కాదు.. స్పోర్టింగ్ ఐకానే.
-అశోక్ భట్టాచార్య, సీపీఐ(ఎం) సీనియర్ నేత.