తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వేస్టేషన్​లో సోనూసూద్​ను అడ్డుకున్న పోలీసులు

సోమవారం రాత్రి శ్రామిక్​ రైలులో ముంబయి నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు వెళుతున్న వారిని చూసేందుకు బాలీవుడ్​ నటుడు సోనూసూద్ ముంబయిలోని​ బాంద్రా రైల్వేస్టేషన్​కు వెళ్లారు. అక్కడ సోనూసూద్​ను ఆర్​పీఎఫ్​ సిబ్బంది అడ్డుకున్నారు. వలస కూలీలను కలవనీయకుండా చేశారు.

Sonu Sood stopped from meeting migrants at Bandra Terminus
బాంద్రా రైల్వేస్టేషన్​లో సోనూసూద్​ను అడ్డుకున్న పోలీసులు

By

Published : Jun 9, 2020, 12:29 PM IST

వలస కార్మికుల హీరోగాగుర్తింపు పొందిన బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ను ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్​లో ఆర్​పీఎఫ్​(రైల్వే రక్షణ దళం) సిబ్బంది అడ్డుకున్నారు. సోమవారం రాత్రి శ్రామిక్​ రైలులో ఉత్తర్​ప్రదేశ్​కు వెళుతున్న వలస కూలీలను కలిసేందుకు వెళ్లిన సోనూసూద్​ను ఆపారు. 'సోనూసూద్​ భాజపా చేతిలో కీలుబొమ్మ' అని శివసేన ఆరోపించిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

బాంద్రా రైల్వే స్టేషన్​లో

అయితే ఈ విషయంపై సోనూసూద్​ తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు.

"సోనూసూద్​ను ఆర్​పీఎఫ్​ సిబ్బంది అడ్డుకున్నారు, మేము కాదు. స్వస్థలాలకు వెళ్తున్న కార్మికులను ఆయన కలవాలనుకున్నారు. అయితే ఆయన నుంచి మాకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు."

-- శశికాంత్​ భందారే, నిర్మల్​ నగర్​ సీనియర్​ ఇన్​స్పెక్టర్​.

ఈ విషయంపై బాలీవుడ్​ నటుడు స్పందించాడు.

సోనూసూద్​
బాంద్రా రైల్వే స్టేషన్​లో సోనూసూద్​ను అడ్డుకున్న పోలీసులు

"నన్ను ప్లాట్​ఫాంలోకి అనుమతించకపోయినా నేను పట్టించుకోను. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేయడం నా బాధ్యత. వారు బాగుండాలని చెప్పడానికే ఇక్కడికి వచ్చా."

--- సోనూసూద్​, బాలీవుడ్​ నటుడు.

అయితే ఆర్​పీఎఫ్​ సిబ్బంది మాత్రం.. ముంబయి రైల్వే డివిజనల్​ మేనేజర్​​ ఆదేశాలు లేనందువల్లే సోనూను అడ్డుకున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:-వలసకూలీల పాలిట దేవుడు సోనూసూద్!

ABOUT THE AUTHOR

...view details