ఇంటి వ్యవహారంపై బాంబే హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. తాను చేపట్టిన నిర్మాణ పనులు మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎంసీజెడ్ఎంఏ) అనుమతులకు లోబడే ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. కావాల్సిన అన్ని అనుమతులను మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఆమోదించారని తెలిపారు. చట్ట విరుద్ధంగా తాను ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని పిటిషన్లో స్పష్టం చేశారు.
ఇంటి విషయంలో సుప్రీంకోర్టుకు సోనూ - సోనుసూద్ న్యూస్
తన ఇంటి విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రముఖ నటుడు సోనూసూద్. తాను చేపట్టిన నిర్మాణ పనులు.. సంబంధిత విభాగాలకు లోబడే ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
![ఇంటి విషయంలో సుప్రీంకోర్టుకు సోనూ Sonu Sood moves SC against HC order on illegal construction notice illegal construction notice](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10447167-696-10447167-1612087331526.jpg)
ఇంటి విషయంలో సుప్రీంకు సోనూ
ముంబయి జూహూలోని తన నివాస సముదాయాన్ని.. అనుమతి లేకుండా సోనూసూద్ హోటల్‌గా మారుస్తున్నారని బీఎంసీ(ముంబయి మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు సోనూకు నోటీసులు జారీ చేశారు. దీనిపై సోనూసూద్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. సోనూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సోనూ.
ఇదీ చూడండి: బీఎంసీ పెట్టిన కేసులో సోనూసూద్‌కు ఊరట!