తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మే 17 తర్వాత ఎలా? ప్రభుత్వం ప్లాన్​ ఏంటి?' - covid in india

లాక్​డౌన్​ కొనసాగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ముందుకెళ్తోందని ప్రశ్నించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కాంగ్రెస్​ పాలిత సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన ఆమె.. మే 17 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అడిగారు.

Sonia questions Centre on post-lockdown strategy
'మే 17 తర్వాత ఏంటి.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోంది?'

By

Published : May 6, 2020, 12:50 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పరిస్థితులపై కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించింది పార్టీ అగ్రనాయకత్వం. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వం వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ, చిదంబరం, ఆయా రాష్ట్రాల సీఎంలు సమీక్షలో పాల్గొన్నారు.

లాక్​డౌన్​ కొనసాగింపుపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు సోనియా.

'' మే 17 తర్వాత ఏంటి? ఎలా? లాక్​డౌన్​ను పొడిగించాలని భారత ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తోంది.''

- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

కేంద్రాన్ని అడగండి...

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. లాక్​డౌన్​ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. లాక్​డౌన్​ నుంచి బయటపడేందుకు కేంద్రం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో ప్రధానిని అడగాలని సీఎంలను కోరారు.

''సోనియా గాంధీ ఇప్పటికే ఆ విషయం ప్రస్తావించారు. ముఖ్యమంత్రులు సమాలోచనలు చేయాలి. లాక్​డౌన్​ నుంచి పూర్తిగా బయటపడేందుకు.. కేంద్రం ఎలా ముందుకెళ్తుందో, వ్యూహాలేంటో మీరు తప్పక అడగాలి.''

- మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధాని.

''లాక్​డౌన్​ నుంచి ఎలా బయటపడాలి.. ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలి'' అనే అంశాలపై రెండు కమిటీలను నియమించినట్లు తెలిపారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.

మంచి ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వనంత వరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోలుకోలేవని అన్నారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. రాష్ట్రాలు.. తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, కేంద్రం నుంచి తక్షణ సాయం కావాలని డిమాండ్​ చేశారు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేష్​ బఘేల్​.

ABOUT THE AUTHOR

...view details