కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'రాజీవ్‌గాంధీ కిసాన్ న్యాయ్ పథకాన్ని' ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించారు. ఇది దివంగత రాజీవ్ గాంధీకి ఇచ్చిన నిజమైన నివాళి అని ఆమె పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం రైతుల స్వావలంబనకు తోడ్పడుతుందని, వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకొస్తుందని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు.
"ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి 'రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన' లాంటి పథకాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి. ఇది ఒక విప్లవాత్మక పథకం, రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా వేసిన పెద్ద ముందడుగు."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి