తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవాకు సోనియా- కొంతకాలం అక్కడే మకాం - దిల్లీ కాలుష్యం

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దిల్లీని వీడిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. గోవాకు చేరుకున్నారు. కొన్నాళ్ల పాటు గోవాలోనే ఆమె నివసించనున్నారు.

sonia gnadhi and rahul arrived to goa from delhi
దిల్లీని వీడి గోవా చేరుకున్న సోనియా గాంధీ

By

Published : Nov 20, 2020, 4:33 PM IST

దిల్లీని వీడిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. గోవాకు చేరుకున్నారు. సోనియా వెంట ఆమె కుమారుడు, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఉన్నారు. గోవా రాజధాని పనాజీలో శుక్రవారం మధ్యాహ్నం వాళ్లు అడుగు పెట్టారు.

గోవా చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ
గోవా చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ
గోవా చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ

దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున.. దిల్లీని వీడి వెళ్లాలని వేరే ప్రదేశానికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆమె.. గోవాలో ఉండేందుకు వచ్చారు.

ఇదీ చూడండి:దిల్లీని వీడనున్న సోనియా గాంధీ!

ABOUT THE AUTHOR

...view details