నీట్ ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ రిజర్వేషన్లను రాష్ట్రాల్లోని వైద్య విద్యా సంస్థల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా నిలిచారు సోనియా కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సామాజిక న్యాయం అందించే విషయంలో ఇటువంటి చర్యలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
'వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి'
రాష్ట్రాల్లోని వైద్య విద్యా సంస్థల్లోనూ నీట్ ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు.
'వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి'
వైద్య విద్యా సంస్థల్లో ఆల్ ఇండియా కోటా కింద ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని... ఈ మేరకు ఓబీసీలకూ రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు సోనియా. 2017 డేటా ప్రకారం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల వారు 11 వేల సీట్లను కోల్పోయారని తెలిపారు.
ఇదీ చూడండి:యూపీలో రెచ్చిపోయిన నేరగాళ్లు.. తీవ్రంగా స్పందించిన యోగి