ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ నేడు నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు రాయ్‌బరేలీలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబీకుల సమక్షంలో నామపత్రం దాఖలు చేయనున్నారు సోనియా.
వరుసగా ఐదోసారి ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సోనియా.
2004 నుంచి సోనియాగాంధీ రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006 ఉప ఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సోనియా విజయఢంకా మోగించారు. ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ మాజీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ సోనియాతో రాయ్‌బరేలీ స్థానంలో పోటీపడుతున్నారు.