కరోనా వేళ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరు అయ్యారు. మరో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంటుకు రాలేదు.
సోనియా గాంధీ.. సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఆమె వెంటే వెళ్లినట్టు సమాచారం. దాదాపు 14రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్ దూరమయ్యారు.
అమెరికా నుంచి వచ్చిన అనంతరం సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాకు సాయం చేసేందుకు ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ అమెరికా వెళ్లనున్నారు. ఆ తర్వాత రాహుల్ దిల్లీకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ప్రయాణానికి ముందుగా..