తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీకే శివకుమార్​ కోసం తిహార్ జైలు​కు సోనియా గాంధీ - latest update on congress party

తిహార్​ జైలులో కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ను కలిశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తిహార్​ జైలుకు సోనియా గాంధీ

By

Published : Oct 23, 2019, 1:10 PM IST

Updated : Oct 23, 2019, 2:47 PM IST

డీకే శివకుమార్​ కోసం తిహార్ జైలు​కు సోనియా గాంధీ

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్​ జైలులో జుడీషియల్​ రిమాండ్​లో ఉన్న కాంగ్రెస్​ సీనియర్​ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​తో కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు.

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్​ కేసులో ఆయనకు మద్దతు ప్రకటించారు సోనియా. కాంగ్రెస్​ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే భాజపా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని శివకుమార్​కు సోనియా తెలిపారు. ఇతర నేతలనూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి అంబికా సోని, ఎంపీ డీకే సురేష్​ ఉన్నారు.

గత నెలలో అరెస్టు

గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్​ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్​ 3న అరెస్టు చేసింది​. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహార్​​ జైలులో ఉన్నారు శివ.

ఇదీ చూడండి: 'ఆదర్శ' వివాహం: రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

Last Updated : Oct 23, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details