కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. దాదాపు 14రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కూడా ఆమె వెంటే వెళ్లినట్టు సమాచారం.
వైద్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా!
సాధారణ వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. రాహుల్ గాంధీ కూడా ఆమెతో పాటు వెళ్లినట్టు తెలుస్తోంది. 14రోజుల పాటు అక్కడే ఉండే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి తిరిగివచ్చిన అనంతరం వీరు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరవుతారని సమాచారం.
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా!
ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్ దూరంకానున్నారు. అమెరికా నుంచి వచ్చిన అనంతరం సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:-'నోట్ల రద్దుతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం'