లాక్డౌన్ కారణంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేలా.. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానికి లేఖ రాశారు. వారికి 21 రోజుల వేతానాలు ముందస్తుగా చెల్లించాలని కోరారు.
గ్రామాల్లో నివసిస్తోన్న పేదలు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయారు. సుమారు 8 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేవు. వీరందరికీ తక్షణమే సాయం అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.