తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం - దిల్లీ

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ భౌతిక కాయాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభిమాన నేతను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం

By

Published : Jul 21, 2019, 1:43 PM IST

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం
పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ పార్థివ దేహాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభిమాన నేతను చూసేందుకు పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీలా దీక్షిత్​ భౌతిక కాయానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.

" షీలా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు ఒక స్నేహితురాలే కాదు అక్క లాంటివారు. షీలా దీక్షిత్​ మరణం కాంగ్రెస్​ పార్టీకి తీరని లోటు. ఆమెను నేను ఎప్పటికీ మరచిపోలేను."

-సోనియా గాంధీ, యూపీఏ ఛైర్​పర్సన్​.

ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి

ABOUT THE AUTHOR

...view details