చైనా యాప్ పబ్జీ ఉత్తర్‌ప్రదేశ్ ఖార్కోడా నగరం జామ్‌నగర్‌లోని ఓ కుటంబంలో విషాదాన్ని మిగిల్చింది. గంటల తరబడి పబ్జీ గేమ్ ఆడుతున్న అమీర్‌ని తండ్రి ఇర్ఫాన్ మందలించాడు. తండ్రి మాటలకు కోపంతో కత్తితో తండ్రి గొంతు కోశాడు అమీర్. తరువాత తనను తాను పొడుచుకున్నాడు.
పబ్జీ ఆడొద్దని వారించిన తండ్రి- గొంతు కోసిన కొడుకు - son slashes father for pubg
చైనా వైరస్ మాత్రమే కాదు చైనా యాప్‌లు సైతం ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది. పబ్జీ ఆడొద్దన్నందుకు ఓ యువకుడు తన తండ్రిపై కత్తితో దాడి చేశాడు. తరువాత తనను తాను పొడుచుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
పబ్జీ ఆడొద్దన్నందుకు తండ్రి గొంతు కోసిన యువకుడు
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు ప్రస్తుతం మీరట్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని సర్కిల్ డివిజనల్ అధికారి దేవేశ్ సింగ్ తెలిపారు. అమీర్ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని, ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారని ఇన్స్పెక్టర్ అరవింద్ మోహన్ శర్మ వివరించారు.