గురక పెడుతున్నాడనే కారణంతో కన్న తండ్రిని కొడుకు అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ పీలీభీత్ జిల్లాలో జరిగింది. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు పోలీసులు.
తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే! - తండ్రిని చంపిన కోడుకు
ఉత్తర్‌ప్రదేశ్ పీలీభీత్ జిల్లాలో దారుణం జరిగింది. గురక పెడుతూ నిద్రపోనియడం లేదనే కోపంతో తండ్రిని కన్న కొడుకు సుత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.
గురక పెడుతున్న తండ్రిని కొట్టి చంపిన కోడుకు
పీలీభీత్ జిల్లా సోందా గ్రామంలో నివాసం ఉంటున్నాడు రామ్ స్వరూప్. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నవీన్, చిన్న కుమారుడు మనోజ్. నిద్ర పోయే సమయంలో బాగా గురక పెడుతున్నాడనే కోపంతో తండ్రిని సుత్తితో కొట్టాడు నవీన్. గాయపడిన స్వరూప్‌ను చుట్టపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు మరణించాడని వైద్యులు నిర్ధరించారు. నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:3 కోట్ల మాస్క్‌ల ఉచిత పంపిణీ: కేంద్రం