తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య! - maharastra news in telugu

ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడి, కన్నవారికి కడుపుకోత మిగిల్చారు ఇద్దరు యువకులు. తల్లిదండ్రులు రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనివ్వలేదని తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలో కేవలం రూ.200 ఇవ్వలేదని అమ్మ మీద కోపంలో ప్రాణాలు తీసుకున్నాడు మరొక వ్యక్తి.

son commits suicide after mother refuses to give 200 rupees
బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!

By

Published : Jun 6, 2020, 4:37 PM IST

ఈ కాలంలో చిన్న సమస్యనే భూతద్దంలో పెట్టి చూసుకుని.. ప్రపంచంలో తమలాంటి బాధ ఎవ్వరికీ లేదనట్టు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువకులు. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లేక తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.

వసంతకుమార్​

తమిళనాడు కోయంబత్తూర్​లోని తడగామ్​కు చెందిన 25 ఏళ్ల వసంతకుమార్​.. ఓ ఐటీ కంపెనీలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. కానీ, వారి దగ్గర అంత డబ్బులేదని.. ఆర్థిక స్థితి కుదుటపడ్డాక కొనిస్తామన్నారు. బైక్​ కొనలేమన్నారనే కోపంతో రాత్రి 9:30 గంటల దాకా మద్యం తాగాడు వసంత్​. ఇంటికొచ్చి మళ్లీ బైక్​ గురించి గొడవపడ్డాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లిపోయాడు. తల్లి ఉదయం లేచి చూసేసరికి వసంత్​ ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.

200 రూపాయలు ఇవ్వలేదని..!

సర్వేశ్​ ఇంగిల్

ఇక మహారాష్ట్ర వాద్రాలో 18 ఏళ్ల సర్వేశ్​ ఇంగిల్​ క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సర్వేశ్​ తండ్రి ఆశీర్వాద్ ఇంగిల్​.. గడ్చిరోలి పోలీస్​ స్టేషన్​లో ఉద్యోగి. లాక్​డౌన్​ కారణంగా ఇంటికి దూరంగా ఉండిపోయాడు. దీంతో, సర్వేశ్​ రూ.200 కావాలని తల్లిని కోరాడు. వృధా ఖర్చులు చేస్తున్నాడని.. డబ్బులిచ్చేందుకు తల్లి ససేమీరా అంది. అంతే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో తండ్రికి ఫోన్​ చేశాడు. తండ్రి కూడా డబ్బులు ఎందుకు అని ప్రశ్నించేసరికి ఆవేశంలో ఫోన్ పెట్టేశాడు. ఆ వెంటనే ఆశీర్వాద్..​ కుమారుడికి ఫోన్ చేసి డబ్బు పంపుతున్నానని చెప్పాడు. కానీ, 'నాకు మీ డబ్బు అక్కర్లేదని' ఫోన్​ పెట్టేసిన సర్వేశ్.​. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారాడు.

ఇదీ చదవండి:ముంబయిలో ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ల్యాడర్

ABOUT THE AUTHOR

...view details