తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''ఈవీఎం ఇస్తే తప్పేంటో అధ్యయనం చేస్తా'' - ఈవీఎం

సాంకేతిక నిపుణుడు, కాంగ్రెస్​ నేత సామ్ పిట్రోడా ​ఈవీఎంలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో ఏదో తప్పు ఉంది.. అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

''ఈవీఎం ఇస్తే తప్పేంటో అధ్యయనం చేస్తా''

By

Published : Apr 18, 2019, 10:06 PM IST

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషీన్​(ఈవీఎం)లపై సుదీర్ఘ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత సామ్​ పిట్రోడా. ఈవీఎంలలో ఏదో తప్పు ఉందని అభిప్రాయపడ్డారీ టెక్నోక్రాట్​ టర్న్​డ్​ పొలిటిషియన్​.

ప్రస్తుతం అందులో ఏ దోషం ఉందో సరైన కారణాన్ని చూపలేకపోయారు పిట్రోడా. కానీ.. ఆయనకు ఈవీఎం యంత్రం ఇస్తే.. తప్పేంటే అధ్యయనం చేస్తానని ప్రకటించారు.

''ఈవీఎం ఇస్తే తప్పేంటో అధ్యయనం చేస్తా''

"ఒక ఇంజినీర్​గా, సాంకేతిక నిపుణుడిగా ఈవీఎంలతో నేను సంతృప్తి చెందట్లేదు. కానీ వాటిని నిందించలేను ఎందుకంటే నా దగ్గర ఈవీఎం మిషన్​ లేదు. ఒక వేళ ఎవరైనా ఈవీఎంను అధ్యయనం చేయడానికి ఏడాది పాటు ఇస్తే అప్పుడు నేను ఏదైనా మాట్లాడతా. మీరు దాని ఆకృతి, సాఫ్ట్​వేర్​ను అర్థం చేసుకోగలరు.. .కానీ ఒకటి మాత్రం నిజం... అందులో ఏదో తప్పు ఉంది. కానీ.. అది మనకు తెలియదు."
- సామ్​ పిట్రోడా, కాంగ్రెస్​ నాయకుడు

ప్రతిపక్ష పార్టీలు ఇటీవలే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. లోక్​సభ ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్​ స్లిప్​లను లెక్కించాలని డిమాండ్​ చేశాయి.

కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్​ పథకం ప్రపంచ వ్యాప్తంగా నిపుణులను సంప్రదించి రూపొందించారని పేర్కొన్నారు పిట్రోడా. దేశంలోని 50 మిలియన్ల నిరుపేదలను ఆదుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇదీ చూడండీ:సార్వత్రిక రెండో దశలో 66 శాతం పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details