తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నన్ను రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారు' - అంబరీష్​

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నిఖిల్​ని మండ్యలో ఓడించడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాను సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి కాంగ్రెస్​పై ఆధారపడబోనన్నారు.

'నన్ను రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారు'

By

Published : Apr 7, 2019, 9:58 PM IST

Updated : Apr 8, 2019, 12:05 AM IST

కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా అంతం చేయటానికి ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మండ్య లోక్​సభ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి కాంగ్రెస్​పై ఆధారపడబోనని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీ(ఎస్​) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎంపీ ఎల్​ ఆర్​ శివరామె గౌడలనే నమ్ముకున్నానని ఆయన అన్నారు. నేనెవరినీ (కాంగ్రెస్​ నేతలను ఉద్దేశించి) విమర్శించబోనని కుమారస్వామి అన్నారు.

"మండ్యలో కొంత మంది కాంగ్రెస్​ నేతలు నిఖిల్​ గెలుపుకోసం పనిచేస్తున్నారు. మరికొందరు పనిచేయడం లేదు. ఇందుకు నేనేమీ నిరాశ చెందడం లేదు. నిఖిల్​ని ఓడించి నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వారికి స్థానిక ప్రజల మద్దతు లేదు." -కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి

మండ్యలో జేడీ (ఎస్) పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

పొరపొచ్చాలు...

కర్ణాటకలో జేడీ(ఎస్), కాంగ్రెస్​ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు తరచూ ​బయటపడుతూనే ఉన్నాయి.

3 రోజుల క్రితం కొంతమంది జేడీ (ఎస్​) కార్యకర్తలు మైసూర్​ ఎంపీ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్​ విజయ్​శేఖర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి జీటీ దేవెగౌడ సమక్షంలోనే భాజపా అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటనలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.

గట్టి పోటీనే...

మండ్య లోక్​సభ స్థానం నుంచి నిఖిల్​ కుమారస్వామి, హసన్​లో ప్రజ్వల్​ రేవణ్ణ పోటీపడుతున్నారు. వీరికి ఆయా స్థానాల్లో కాంగ్రెస్​ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మండ్యలో నిఖిల్​కు పోటీగా దివంగత నేత అంబరీష్​ భార్య, నటి సుమలత బరిలో నిలిచారు. ప్రభుత్వం మండ్యలో అల్లర్లు సృష్టిస్తోందని సుమలత ఆరోపిస్తున్నారు. జేడీ (ఎస్​) నేతలు తనను ఓడించడానికి సుమలత పేరు గల మరో ముగ్గురు మహిళలను మండ్యలో పోటీకి నిలిపారని ఆమె దుయ్యబట్టారు. దీనిపై స్పందించిన సీఎం కుమారస్వామి, ఎన్నికల్లో పోటీచేయకుండా ఎవరినైనా నేనెలా ఆపగలనని ప్రశ్నించారు.

సుమలతకు భాజపాతో పాటు కొంత మంది కాంగ్రెస్​ నేతల మద్దతుంది. నిఖిల్​ కుమారస్వామికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Last Updated : Apr 8, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details