'కొన్ని ట్యూబ్లైట్లు ఇంతే...' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పరోక్షంగా ఎద్దేవా చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసిన ప్రధాని... కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.
"ఓ కాంగ్రెస్ నేత మాటలను నిన్న నేను విన్నా. 6 నెలల్లో ప్రజలు మోదీని కర్రలతో కొడతారు అని ఆ నేత అన్నారు. ఇది కొంత కఠినమైన సవాలు కాబట్టి.. సన్నద్ధమవ్వడానికి 6 నెలల సమయం పడుతుంది. అన్ని నెలల సమయం అంటే మంచిదే! నేను కూడా సిద్ధంగా ఉంటా. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తా. 20 ఏళ్లుగా నా మీద వినిపిస్తున్న తిట్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. ఇప్పుడు నేను చేసే సూర్య నమస్కారాలతో నా వీపు ఆ కర్రల దెబ్బలను తట్టుకునేలా సిద్ధం చేసుకుంటా. ముందుగానే చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ 6 నెలలు వ్యాయామ సమయం పెంచుకుంటా. నేను 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉన్నా.. కానీ వారికి అర్థమవడానికి ఇంతసేపు పట్టింది. చాలా 'ట్యూబ్లైట్లు' ఇలాగే ఉంటాయి..."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి