తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశానికి జవాను భార్య సాయం.. ఎందరికో ఆదర్శం! - latest pm cares fund news

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆమె ఓ జవాను అర్ధాంగి. యుద్ధభూమిలో భర్త ప్రాణాలు విడిస్తే.. ఆ బాధను దిగమింగి అర్ధ శతాబ్ద కాలంగా ధైర్యంగా జీవిస్తోంది. ఇప్పుడు దేశం ఆపదలో ఉందని తెలిసి ప్రధాని సహాయ నిధికి రూ.2 లక్షలు విరాళమిచ్చి భరతమాత బిడ్డ అనిపించుకుంది. అందుకే త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్ రావత్‌.. యావత్​ దేశం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Soldier's widow donates to PM CARES fund: Moved by gesture, CDS urges people to at least pay taxes
దేశానికి జవాను భార్య సాయం.. ఎందరికో ఆదర్శం!

By

Published : May 16, 2020, 6:28 PM IST

దేశభక్తి అంటే వాట్సప్​, ఫేస్​బుక్​లలో పోస్టులు పెట్టడం కాదు.. దేశానికి ఆపద వచ్చినప్పుడు వీలైనంత సాయం చేయడమని నిరూపించింది ఓ జవాను భార్య.

ఉత్తర్​ప్రదేశ్​లోని అగస్థ్యముని పట్టణానికి చెందిన శ్రీమతి దర్శిని దేవీ... ఇప్పుడు యావత్​ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేవీ భర్త భారత సైన్యంలో హవల్దార్​గా సేవలందించారు. 1965లో పాకిస్థాన్​తో జరిగిన యుద్ధంలో దేశం కోసం పోరాడి ఆయన వీరమరణం పొందారు. దేశభక్తినే నిలువెల్లా అలవరుచుకున్న దర్శిని దేవీ.. కరోనా విపత్తులో దేశానికి తనవంతు సాయం చేసింది. గ్రామ అధికారుల ద్వారా ప్రధాని సహాయ నిధికి ఇన్నేళ్లుగా తాను దాచుకున్న రూ.2లక్షలు విరాళంగా ఇచ్చేసింది.

ఆమె ఉదార గుణానికి యావత్​ దేశం సలాం చేసింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని దేశానికి సాయపడాలని స్వయంగా సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. ఆమెలా డబ్బులు చెల్లించలేకపోయినా కనీసం మనం కట్టాల్సిన పన్నులు సక్రమంగా కడితే చాలన్నారు. దేవీ చేసినపని భారత సైన్యానికే గర్వకారణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details