నియంత్రణ రేఖ వెంబడి పాక్ దుశ్చర్యలకు అంతులేకుండా పోతోంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.
పాక్ చర్యను.. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.