తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి- భారత జవాను మృతి - ఒప్పందం

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీరు రాజౌరీ జిల్లా వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు.

మరోసారి పాక్​ దుర్నీతి- భారత జవాను మృతి

By

Published : Jul 22, 2019, 6:08 PM IST

జమ్ముకశ్మీరు రాజౌరీ జిల్లా వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ బలగాలు గుళ్ల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. గత మూడు రోజుల్లో జమ్ము ప్రాంతంలో పాక్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి.

సుందర్​బని సెక్టార్​లో గస్తీ కాస్తోన్న భారత జవాన్లే లక్ష్యంగా దాయాది సైన్యం రెచ్చిపోయింది. ఈ కాల్పుల్లో జవాను గాయపడగా... సైనిక ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

శనివారం కూడా...

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో పాక్​ బలగాలు పూంచ్​ జిల్లా మెంధార్​ ప్రాంతంపై దాడికి తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details