సరిహద్దు వెంట పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరోసారి భారత దళాలపై కాల్పులకు తెగబడింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగాం సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఘటన జరిగింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. అయితే ఇరువర్గాల మధ్య పోరులో ఒక భారత జవాను వీరమరణం పొందగా.. ఇద్దరు గాయపడ్డారు.
సరిహద్దులో పాక్ కాల్పులు..సైనికుడు మృతి - LoC in Kupwara latest news
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత సైనికుడు ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
సరిహద్దులో పాక్ కాల్పులు.. ఒక సైనికుడు మృతి, ఇద్దరికి గాయాలు
నౌగాం సెక్టార్‌లోని పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు ఆర్మీ అధికారులు. మరణించిన జవాను భూపేందర్ సింగ్ కాగా.. లాన్సే నాయక్ వెంకటేశ్, సిపాయి షజల్ గాయపడినట్లు చెప్పారు.