తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విధుల్లో ఉన్న జవాను ఆచూకీ గల్లంతు - Baramulla district

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడు ఆచూకీ కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సైనికుడు జీలం నదిలో మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు సమాచారం.

jawan
విధుల్లో ఉన్న జవాను ఆచూకీ గల్లంతు

By

Published : Jun 8, 2020, 5:14 AM IST

Updated : Jun 8, 2020, 6:15 AM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో ఓ జవాను తప్పిపోవడం చర్చనీయాంశంగా మారింది. 8 జాట్ రెజిమెంట్​కు చెందిన సైనికుడు బోనియర్ పోలీస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆచూకీ కోల్పోయినట్లు సైన్యాధికారులు ఫిర్యాదు చేశారని స్థానిక పోలీసులు వెల్లడించారు.

'ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సైనికుడు ఆచూకీ కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జీలం నదిలో మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నామ'ని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సైనికుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:ఉగ్ర కుట్రకు పాల్పడిన మహిళకు కరోనా

Last Updated : Jun 8, 2020, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details