తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పసిడి వన్నెలో కనువిందు చేస్తున్న గ్రహణ సూర్యుడు - గ్రహణ సమయం.. మరికాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం

solar eclipse
గ్రహణ సమయం.. మరికాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం

By

Published : Jun 21, 2020, 11:23 AM IST

Updated : Jun 21, 2020, 12:39 PM IST

12:38 June 21

నేపాల్​లో అర్థ చంద్రాకారంలో గ్రహణ సూర్యుడు

నేపాల్​లో అర్థ చంద్రాకారంలో కనిపించిన దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఉదయం 10.52 నుంచి 2.32 వరకు సూర్యగ్రహణం ఉంటుందని నేపాల్​కు చెందిన చెందిన బీపీ కోయిరాలా ప్లానెటోరియం అధికారులు ప్రకటించారు.

12:25 June 21

దిల్లీలో గ్రహణాన్ని కమ్మేసిన మేఘాలు

దేశ రాజధాని దిల్లీలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మేఘాలు కమ్మేశాయి. నలుపు మేఘాల మధ్య గ్రహణ సూర్యుడు లీలగా కనిపించాడు.

12:13 June 21

ఉత్తరాఖండ్​లో సంపూర్ణ గ్రహణం

సంపూర్ణ గ్రహణ దృశ్యం ఉత్తరాఖండ్​లో ఆవిష్కృతమైంది. పసుపు వన్నెలో సంపూర్ణ గ్రహణ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

11:58 June 21

పంజాబ్​లో గులాబీ వన్నెలో గ్రహణం

పంజాబ్​లో గ్రహణ సూర్యుడు గులాబీ వన్నె నెలవంక ఆకారంలో మెరిసిపోతున్నాడు. మరికాసేపట్లో సంపూర్ణ గ్రహణం కనిపించే అవకాశం కనిపిస్తోంది.

11:41 June 21

పాకిస్థాన్​లో గ్రహణం..

సూర్యుడిని కొంతభాగం మినహా వదిలేసిన చంద్రుడి దృశ్యం పాక్​లో కనిపించింది. ఉదయం 8.46 నుంచి మధ్యాహ్నం 2.34 గంటలవరకు గ్రహణం కనిపించనుందని పాక్ వాతావరణ శాఖ ప్రకటించింది.

11:27 June 21

ఉత్తరాఖండ్​లో గ్రహణం

ఉత్తరాఖండ్​లో సూర్యగ్రహణ దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సూర్యుడిని మింగేసినట్టు కనిపిస్తున్నాయి. 12.5 నిమిషాలకు ప్రారంభమయ్యే సంపూర్ణ గ్రహణం 1.50 నిమిషాల వరకు కనిపించనుంది.

11:12 June 21

మరికాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం

సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చే సమయం ఆసన్నమయింది. మరికాసేపట్లో పూర్తిస్థాయి సూర్యగ్రహణం కనిపించనుంది. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు పూర్తిస్థాయిలో సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. ఉదయం 9.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. మధ్యాహ్నం 3.04 నిమిషాల వరకు కొనసాగనుంది. దిల్లీ, జమ్ముకశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్​ల్లో గ్రహణం కనువిందు చేస్తోంది. గ్రహణం కారణంగా ఆలయాలను మూసేశారు అధికారులు.

ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహా సముద్రం ప్రాంతాల నుంచి గ్రహణం కనిపిస్తోంది

Last Updated : Jun 21, 2020, 12:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details