శీతలపానీయాలతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. చక్కెర లేదా కృత్రిమ తీపి పదార్థాలు వాడే ఈ ద్రావణాలను సేవిస్తే ఆయువు తగ్గుతోందని తెలిపింది. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల శీతల పానీయాలు సేవించే వారికి మరణం తొందరగా వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
ఐరోపాలోని 10 దేశాలకు చెందిన 4.5 లక్షల మందిపై 1992-2000 మధ్యకాలంలో సర్వే చేశారు. తర్వాత 16 ఏళ్లుగా దీనిపై పరిశోధన చేసి.. ఈ వివరాలను 'జామా ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్లో ప్రచురించారు. ఈ నివేదికను పరిశోధకుడు నీల్ మర్ఫీ వివరించారు.