తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాలోకి కర్ణాటక విశ్రాంత సీఎస్​ రత్నప్రభ - రత్నప్రభ

కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ భాజపాలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

భాజపాలో చేరిన కర్ణాటక విశ్రాంత సీఎస్​

By

Published : Apr 4, 2019, 6:44 AM IST

మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి రత్నప్రభ భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు రత్నప్రభ. దేశ సేవ చేయడానికి భాజపాలో చేరడమే సరైన మార్గమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

గతేడాది జూన్​లో ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు రత్నప్రభ. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో రత్నప్రభకు మంచి గుర్తింపు ఉంది. ఆ ప్రాంతంలో వివిధ పదవుల్లో గతంలో ఆమె విధులు నిర్వర్తించారు. రాయ​చూరు జిల్లాకు మొట్టమొదటి మహిళా కలెక్టర్​గా పనిచేశారు.

రత్నప్రభ 1981 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారిణి. కర్ణాటకకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మహిళా అధికారిణుల్లో రత్న మూడోవారు.

ABOUT THE AUTHOR

...view details