శీతాకాలం ఆరంభమవడం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తుంది. దీంతో మనాలి-లేహ్ రహదారిని మంచు దుప్పటి కప్పేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భద్రత బలగాలు సహా ఆ మార్గంలో ప్రయాణించే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖోక్సర్, సిసు గొండోలా మధ్య తేలికపాటి హిమపాతం.. వాహనాల రాకపోకలను ప్రభావితం చేసింది. దీంతో పర్యటకులు సైతం ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో వాతావరణం బాగానే ఉంటుందని.. ఉదయం విపరీతంగా మంచు కురుస్తుందని స్థానికులు చెబుతున్నారు.