ఎక్కువమంది వినియోగించుకోని ఏటీఎంలలో వీధి కుక్కలు తిష్ట వేస్తుంటాయి. అలాంటిది ఏకంగా ఓ భారీ సర్పం ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లడమే కాదు, ఏకంగా మెషీన్‌లోకి జారుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏటీఎం మిషన్‌లోకి ప్రవేశించిన నాగరాజు - latest snake news
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ఏటీఎంలోకి నాగరాజు ప్రవేశించాడు. డబ్బులు కావాలో, లేక ఎండ ఉక్కపోతగా ఉందో తెలీదు కానీ.. కాసేపు చాలా హడావిడి చేశాడు. ఈ నాగరాజు మనిషి మాత్రం కాదండోయ్ అది ఒక పాము. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏటీఎం మిషన్‌లోకి ప్రవేశించిన నాగరాజు
ఘజియాబాద్‌లోని ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో అందరూ చూస్తుండగానే ఓ పాము ప్రవేశించింది. గమనించిన సెక్యూరిటీ గార్డు ఏటీయం తలుపును మూసేయటం వల్ల అది బయటకు రాలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మెషీన్ పైకి ఎక్కి దానిలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపలకు ప్రవేశించింది. ఈ సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.