నిరంతరం సభలు, సమావేశాలతో తీరికలేకుండా గడిపే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం సరదాగా కత్తి తిప్పారు. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థులతో కలిసి స్టెప్పులు కూడా వేయడంతో ఆ సన్నివేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి ప్రదర్శించిన అభినయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర జౌళి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘మహిళా అభ్యుదయ సదస్సు’కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ సంప్రదాయ నృత్యమైన ‘తల్వార్ రాస్’కు అభినయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి స్మృతి కూడా వారితో కలిసి నృత్యం చేశారు.